ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పాడి రైతులకు శుభవార్త చెప్పారు. పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రాష్ట్రంలోని మూడు లక్షల మంది పాడి రైతులకు రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. పశు సంవర్థక శాఖ రానున్న రెండు నెలల్లో రుణాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పాడి రైతుల నుంచి ఆ శాఖ సహాయకులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రభుత్వం సెక్యూరిటీ లేకుండా లక్షా 60 వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధమైంది. 
 
ప్రభుత్వం ఇచ్చే ఈ రుణాలతో పాడి రైతులు పశువులను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే పశువులు ఉన్న రైతులు ఈ రుణాలను పశుగ్రాస సాగుకు, యాంత్రిక పరికరాల కొనుగోలు కొరకు ఉపయోగించుకోవచ్చు. అధికారులు ఇప్పటికే పాడి రైతుల నుంచి 6,000 దరఖాస్తులు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ రుణాలపై 9 శాతం వడ్డీరేటును ప్రభుత్వం నిర్ణయించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: