బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారంలో ఆయన మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో సుశాంత్ అభిమానులు సల్మాన్ ఖాన్ ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయనపై విమర్శలు చేస్తున్నారు. దీంతో సల్మాన్ అభిమానులు కూడా సుశాంత్ అభిమానులపై సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు.
అభిమానుల మధ్య మాటల యుద్ధాలు జరుగుతుండటంతో సల్మాన్ ఖాన్ సుశాంత్ అభిమానులు చేస్తున్న విమర్శలను, శాపాలను పట్టించుకోవద్దని... వాళ్లు బాధతో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని...వారికి అభిమానులు అండగా నిలబడాలని సూచించారు. సుశాంత్ ఆత్మహత్య వల్ల అతని కుటుంబం, అభిమానులు మానసిక వేదన అనుభవిస్తున్నారని వారికి తోడుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
A request to all my fans to stand with sushant's fans n not to go by the language n the curses used but to go with the emotion behind it. Pls support n stand by his family n fans as the loss of a loved one is extremely painful.
— Salman Khan (@BeingSalmanKhan) June 20, 2020