ప్రధాని మోదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ యోగా ప్రజలను ఏకం చేస్తుందని అన్నారు. యోగా ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని... రోగ నిరోధక శక్తి పెరిగితేనే రోగాలను జయించడం సాధ్యమవుతుందని చెప్పారు. యోగా శ్వాసకోస వ్యవస్థను ఉత్తేజపరుస్తుందని అన్నారు. కరోనా నియంత్రణకు యోగా దోహదం చేస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.
యోగా మానసిక ప్రశాంతతను కలజేస్తుందని అన్నారు. ఎవరి ఇళ్లలో వారు ఫ్యామిలీతో కలిసి యోగా చేసుకోవాలని మోదీ సూచించారు. అందరూ సోషల్ డిస్టన్స్ పాటించాలని.... విపత్కర కాలంలో యోగాను జరుపుకోవడం ఒక సవాలే అని అన్నారు. ఇంట్లోనే యోగా... కుటుంబంతో యోగా అని చెప్పిన మోదీ యోగా ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుందని అన్నారు.