ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు ఆడియో, వీడియోలతో సహా దొరికిపోయాడని... మున్సిపల్ కమిషనర్ అధికారిని బట్టలిప్పి కొట్టాలి అని వ్యాఖ్యలు చేసిన తరువాత ఆయనను వెనకేసుకుని రావడం ఏమి రాజకీయమని ప్రశ్నిస్తున్నానని చెప్పారు. మీ హయాంలో వనజాక్షిపై దాడి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టినట్టు గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు.
మహిళలు టీడీపీకి పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారా....? అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ నేతలు సదరు మహిళా నేతను ఎందుకు దూషించాడని అయ్యన్న పాత్రుడిని ఒక్క మాట కూడా అడగలేకపోతే ఏం నాయకులు మీరని వ్యాఖ్యలు చేశారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే అయ్యన్న పాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు.