లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజలకు ట్విట్టర్ ద్వారా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని.... యోగా శరీరం, మనస్సులో చైతన్యం నింపుతుందని అన్నారు. యోగా వ్యక్తిగతంగా ఎదగటానికి సహకరిస్తుందని తెలిపారు. ప్రస్తుత పోటీ యుగంలో విజయానికి శారీరక మరియు మానసిక శ్రేయస్సు కీలకం అని చెప్పారు. 
 
మన లక్ష్యాలను సాధించటానికి యోగా ఒక శక్తివంతమైన మాధ్యమం అని అన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నాని చెప్పారు. యోగా ఆసనాలకు సంబంధించిన పోటోలు, వీడియోలను ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 6.30 గంటలకు యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు సందేశం ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: