ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభణ వల్ల ఈ సంవత్సరం ఇంట్లోనే ఉండి యోగా జరుపుకోవాల్సి వస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి యోగా చేయాలని సూచించారు. కరోనా ఉధృతి దృష్ట్యా సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని గుర్తు చేశారు. కరోనా విజృంభణ వల్ల ప్రపంచ దేశాలు యోగా ప్రాముఖ్యతను గుర్తించాయని పేర్కొన్నారు. 
 
రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి యోగాలో అనేక ఆసనాలు ఉన్నాయని తెలిపారు. కరోనా శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యోగాలోని ప్రాణాయామం ద్వారా దాన్ని అధిగమించొచ్చని పేర్కొన్నారు. ప్రజలు అనేక రకాల ప్రాణాయామాలను, యోగాసనాలను అలవరచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: