మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. చంద్రబాబు ఉద్యోగుల కష్టార్జితానికి కన్నమేశారని కాగ్ నివేదికలో తేలిందని చెప్పారు. టీడీపీ హయాంలో 731 కోట్ల రూపాయల సీపీఎస్ డబ్బును బ్యాంకుకు జమ చేయలేదనిపేర్కొన్నారు. ఉద్యోగుల జీతాల నుంచి చంద్రబాబు పది శాతం కొట్టేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రత్యేక విమానాల కోసం, దొంగ దీక్షల కోసం బాబు డబ్బు దుబారా చేశాడని అన్నారు. మరో ట్వీట్లో చంద్రబాబు ఏపీ ఎదుగుదలలో అడ్డంకులు సృష్టించాడని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గతంలో ఎప్పుడూ చూడని మోసగాడు చంద్రబాబు అని పేర్కొన్నారు. పేదల సంక్షేమం విషయంలో దుర్మార్గంగా వ్యవహరించిన చంద్రబాబును ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: