జూన్ 15వ తేదీ రాత్రి గాల్వన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఘర్షణల అనంతరం భారత్ చైనా బలగాలు పూర్తిస్థాయిలో ఇక్కడ మోహరింపబడ్డాయి. 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారీగా బలగాలను మోహరించటంతో భారత్ కూడా బలగాలను మోహరిస్తోంది. 
 
ప్రస్తుతం ఇరు దేశాల సైనికులు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఎదురెదురుగా నిలబడ్డారు. ఇరు దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. ఆ తర్వాత సరిహద్దు వివాదం పరిష్కారం అయ్యే వరకు అక్కడ శాంతిని కాపాడాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండటంతో భారత్ ధీటుగా సమావేశం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు యుద్ధంలాంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: