దేశంలో విజృంభిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం దాదాపు అన్ని రంగాలపై పడుతోంది. విద్యా రంగంపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా విజృంభణ వల్ల ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. 
 
కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. అన్ని పని దినాలలో విద్యార్థులకు భోజనం అందించడం ఈ పథకం లక్ష్యం. అయితే బడులు ప్రారంభం కాకపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉండటంతో మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యాన్ని విద్యార్థుల ఇండ్లకే పంపిణీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్నందున ఆ బియ్యాన్నే సర్కారు బడుల్లో చదువుతున్న 24 లక్షల మంది విద్యార్థులకు పంపిణీ చేయడంపై రాష్ట్ర సర్కారుకు విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే బియ్యం పంపిణీ జరగనుందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: