ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో డ్రస్ జిప్ కరోనా కేసులను బయటపెట్టింది. దీంతో అధికారులు 8 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. జిల్లాలోని టెక్కలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. టెక్కలిలోని గొల్లవీధికి చెందిన ఒక కుటుంబంలో నాలుగేళ్ల బుడతడు ఆడుతూ ఏదో మింగేశాడు. బాలుడు గొంతు నొప్పితో బాధ పడుతూ ఉండటంతో తల్లిదండ్రులు లోకల్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన ఏమీ లేదని చెప్పడంతో లైట్ తీసుకున్నారు. 
 
మరుసటి రోజు నొప్పి ఎక్కువ కావడంతో బాలుడి తల్లిదండ్రులు డిజిటల్ ఎక్స్ రే తీయించగా గొంతులో డ్రెస్ జిప్ ఒకటి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. గొంతు భాగం కాబట్టి మత్తు ఇచ్చి జిప్ తీయించాల్సి ఉండటంతో బాలుడికి కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారు. ఈ పరీక్షల్లో ఆ బాబుకు కరోనా నిర్ధారణ అయింది. అనంతరం బాలుడి తల్లికి కూడా కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు 8 వీధులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: