బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై కుటుంబ సభ్యులు, అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్, ఫైనాన్సియల్‌గా ఎలాంటి ఇబ్బందులు లేని సుశాంత్ ఎలా ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా రియా చక్రవర్తి పొంతన లేని వ్యాఖ్యలు చెబుతూ ఉండటంతో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముంబై పోలీసులు రియా చక్రవర్తిని విచారించిన సమయంలో సుశాంత్ ఇంట్లో దయ్యాలు ఉన్నాయంటూ కేసును రియా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. సుశాంత్ యశ్‌రాజ్ ఫిల్మ్స్‌తో కాంట్రాక్టులు రద్దు చేసుకున్నాడని రియా చెప్పింది. అయితే సుశాంత్‌కు కొన్నేళ్లుగా చికిత్స అందించిన మానసిక వైద్యుడు కేసరి చావ్డా ప్రియురాలు రియా చక్రవర్తి ప్రవర్తన కూడా సుశాంత్‌ను ఇబ్బంది పెట్టిందని.... మహేష్ భట్, రియా చక్రవర్తిల మధ్య ఎఫైర్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పినట్టు సమాచారం.