ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ హవా అంతకంతకూ పెరుగుతోంది. గత ఏడాది కాలంలో సీఎం జగన్ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు ప్రజల్ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. జగన్‌ ఏడాది పాలనపై ‘సెంటర్‌ ఫర్‌ సెఫాలజీ స్టడీస్‌’ (సీసీఎస్‌) జూన్‌ 2 నుంచి 8 వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాలు.. 44 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో 55.8 శాతం మంది ప్రజలు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారని తేలింది. 
 
టీడీపీ అధికారంలో ఉండాలని 38.3 శాతం ప్రజలు, బీజేపీ, జనసేన రెండు పార్టీలకూ కలిపి 5.3 శాతం ప్రజలు మద్దతు పలుకుతున్నారు. కరోనా విజృంభణ వల్ల ఆర్థిక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న జగన్ సర్కార్ కష్టకాలంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు. రాష్ట్రంలో జగన్‌ సంక్షేమ పథకాలు బాగున్నాయని 65.3 శాతం ప్రజలు.... బాగోలేవని 33.7 శాతం మంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జగన్ పనితీరు బాగుందని 62.6% మంది ప్రజలు అభిప్రాయపడగా 36.1 శాతం మంది బాగోలేదన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: