ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గ్యాంగ్ వార్ ఘటనలు సాధారణంగా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఈ రెండు ఘటనలకు ఆర్థిక లావాదేవీలు కారణం కాగా తాజాగా వేములవాడలో ఒక చిన్న ఘటన వల్ల రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. 
 
వేములవాడలోని ఎమ్మార్వో ఆఫీసు దగ్గర ఒక యువకుడు బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో మరో యువకుడు మందలించాడు. అక్కడి నుంచి వెళ్లిన మొదటి యువకుడు తన మనుషులను తీసుకురావడంతో రెండో వ్యక్తికి సంబంధించిన యువకులు దాడి చేశారు. పోలీసులు వచ్చినా సరే ఖాతరు చేయకుండా ఇరు వర్గాలు తలపడ్డాయి. దాదాపు 20 నిమిషాలపాటు రెండు వర్గాల మధ్య పోరు కొనసాగింది. ఈ ఘటనతో ప్రజలు వణికిపోయారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: