గత సోమవారం గాల్వాన్ లోయలో చైనా దళాలు-భారత జవాన్లకు మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్రజలు చైనా తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని ఘట్కోపర్ ప్రాంతంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు నేడు చైనా తీరుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. . చైనా వస్తువులు బహిష్కరించాలని పోస్టర్లు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
డ్రాగన్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పోస్టర్‌ను కిందపడేసి తొక్కి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చైనాకు గట్టిగా సమాధానం చెప్పాలని వాళ్లు డిమాండ్ చేశారు. చైనా వస్తువులు కొనకుండా ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతియాలని వ్యాఖ్యలు చేశారు.