పాకిస్తాన్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. . పాక్ క్రికెటర్లు షాదాబ్, హరీష్ రవూఫ్, హైదర్ అలీలకు కరోనా నిర్ధారణ అయినట్టు పాక్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. ఇప్పటికే మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికు కరోనా నిర్ధారణ కాగా మరో ముగ్గురు క్రికెటర్లు కరోనా భారీన పడటం అభిమానులను కలవరపెడుతోంది. ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే ముందు రావల్పిండిలో పరీక్షలు చేయగా వైరస్ నిర్ధారణ కావడంతో అధికారులు ముగ్గురినీ హోం క్వారంటైన్ కు పరిమితం చేశారు.
ఇంకా కొందరు ప్లేయర్స్, అధికారులకు కరాచీ, లాహోర్,పెషావర్‌లలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఫలితాలు తెలియాల్సి ఉంది. పాక్ లో ఇప్పటివరకు 1,82,0000 మంది వైరస్ భారీన పడ్డారు. 3,606 మంది వైరస్ సోకి మృతి చెందారి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో పాక్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.