ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు సైతం కరోనా భారీన పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కరోనా నిర్ధారణ కావడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత స్నేహితురాలికి కరోనా నిర్ధారణ కావడంతో సామ్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సమంత కొద్ది రోజుల క్రితం తన ఫ్రెండ్, పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి బుగ్గపై గట్టిగా ముద్దు పెడుతున్న ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ ఫోటో షేర్ చేసిన తరువాత ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో సామ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. సమంత, నాగచైతన్య ఆరోగ్యపరిస్థితి గురించి అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. సమంత పాత ఫోటో షేర్ చేసిందా....? రీసెంట్ ఫోటోనా...? అనే విషయం గురించి స్పష్టత రావాల్సి ఉంది.