ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు, వారి సన్నిహితులు వివిధ కేసుల్లో అరెస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్నేహితుడు నలంద కిషోర్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిలపై మీడియాలో హల్‌చల్ అవుతున్న కథనాన్ని ఫార్వర్డ్ చేశారంటూ మూడు రోజుల క్రితం కిషోర్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఆయన నోటీసులకు ఇచ్చిన సమాధానానికి సంతృప్తి వ్యక్తం చేయని సీఐడీ అధికారులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా నిన్న అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.