ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో వైభవంగా జరిగే పండగల్లో బోనాల పండగ ఒకటి. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ఈ సంవత్సరం పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటం... రాష్ట్రంలో మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ నెల 25న గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయని.... ఈ సంబరాల్లో కేవలం పది మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి లేదని..... ప్రభుత్వమే అన్ని దేవాలయాల్లో పట్టువస్త్రాలను సమర్పిస్తుందని..... ఆలయాల్లో పూజారులు మాత్రమే బోనాలు నిర్వహిస్తారని పేర్కొంది. ఉత్సవాలను టీవీలు, సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని.... ప్రజలు ఇళ్లల్లోనే ఉండి మొక్కులు చెల్లించుకోవాలని సూచించింది.