చైనా భారత్ దేశాల మధ్య గత కొన్ని రోజులుగా సరిహద్దు వివాదం వల్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఉద్రిక్తతలను నివారించాలనే ఉద్దేశంతో నిన్న ఇరు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయని తెలుస్తోంది. సామరస్య, సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయని సమాచారం. తూర్పు లడఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యం వెనక్కిమళ్లేందుకు అంగీకారం కుదిరిందని భారత ఆర్మీ వెల్లడించింది. 
 
చైనా భూభాగంలోని మోల్దో ప్రాంతంలో సోమవారం ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్‌ జనరల్‌ స్ధాయి అధికారుల మధ్య నిన్న చర్చలు జరిగాయి. జూన్ 6వ తేదీన జరిగిన చర్చల అనంతరం సరిహద్దు ప్రాంతాల నుంచి సేనల ఉపసంహరణకు భారత్‌, చైనా అంగీకరించాయి. కానీ కొద్దిరోజులకే భారత్‌, చైనా సేనల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: