ఐసీఐసీఐ బ్యాంక్ తాజాగా విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరుతో కోటి రూపాయల వరకు ఎడ్యుకేషన్ లోన్ ను తక్షణమే మంజూరు చేయనుంది. విద్యార్థులు బ్యాంక్ లను సంప్రదించకుండానే ఆన్ లైన్ లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 సంవత్సరాల లోపు లోన్ అమౌంట్‌ను తిరిగి చెల్లించే సదుపాయాన్ని కూడా ఐసీఐసీఐ కల్పిస్తోంది.
దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఐసీఐసీఐ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి లాగిన్ అయిన తరువాత ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను చెక్ చేసుకోవాలి. అనంతరం అమౌంట్, యూనివర్సిటీ, కాస్ట్ ఆఫ్ స్టడీ ఇతర విషయాలను నమోదు చేయాలి. టర్మ్స్ & కండీషన్స్ చెక్ చేసుకుని మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అనంతరం మెయిల్ కు రిలేషన్ షిప్ మేనేజర్ వివరాలతో కూడిన శాంక్షన్ లెటర్ వస్తుంది. పూర్తి వివరాల కోసం సమీపంలోని బ్యాంక్ అధికారులను సంప్రదించవచ్చు.