దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్, వ్యాక్సిన్ గురించి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా చైనా పరిశోధకులు కరోనా నుంచి కోలుకున్న వారిలో కొత్త సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు . 
 
కరోనా సోకిన వారిలో భవిష్యత్తులో యాంటీబాడీ స్థాయిలు తగ్గుతాయని.... రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చాంగ్‌కింగ్ మెడికల్ యూనివర్శిటీ పరిశోధకులు రోగలక్షణాలు ఉన్న 37 మంది కరోనా బాధితులు, రోగ లక్షణాలు లేని 37 మంది రోగులపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత రెండు మూడు నెలల్లో రోగ నిరోధక శక్తి బాగా తగ్గుతుందని.... వైరస్ మానవుల ఇమ్యూనిటీపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: