ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో, తెలంగాణలోని నల్గొండ జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురి చేశాయి. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల్ లో భూమి కంపించింది. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్లను విడిచి బయటకు పరుగులు తీశారు. ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే మరోవైపు భూప్రకంపలు ఇళ్లలో ఉన్నవారిని భయపెడుతున్నాయి. భారీ శబ్దంతో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది.
భూకంప తీవ్రత వివరాలు తెలియాల్సి ఉంది. అధికారులు మాత్రం సాధారణ భూకంపాలేనని ప్రజలు భయపడవద్దని చెబుతున్నారు. స్థానికులు అధికారులు సర్వే చేసి అపోహలు తొలగించాలని కోరారు. నల్గొండ జిల్లా చింతలపాలెం, మేళ్లచెరువు మండలాలలో ఎక్కువగా భూప్రకంపనలు వస్తున్నాయని... గతంతో పోలిస్తే ఈరోజు ఎక్కువ శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.