దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కరోనా విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వైరస్ రోజురోజుకు వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన జగన్ సర్కార్ నేడు డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర వృత్తి విద్యా కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు కూడా రద్దు కానున్నాయి. పరీక్షల రద్దు నేపథ్యంలో మార్కులు లేదా గ్రేడింగ్ పై కీలక నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖ సంబంధిత అధికారులను ఆదేశించింది. స్థానిక విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీలు వీటిపై నిర్ణయం తీసుకోనున్నాయి.