కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఐఎంఏ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విజయ్ శంకర్ నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని జయనగర్ లో ఆయన విగతజీవిగా కనిపించారు. 400 కోట్ల రూపాయల ‘ఐ మానెటరీ అడ్వైజరీ’ స్కామ్‌లో లంచం తీసుకున్నారని ఆయనపై ఆరోపణలు వినిపించాయి. స్కాంలో ప్రధాన నిందితుడి నుంచి కోటిన్నర రూపాయలు ఆయన లంచం తీసుకున్నారు.
ఈ కేసులో 2019 జులై 8వ తేదీన విజయ్ శంకర్ అరెస్ట్ అయ్యారు. పారప్పానలోని అగ్రహార జైలులో విచారణ ఖైదీగా ఉన్న విజయ్ శంకర్ గతేడాది 27న బెయిల్ పై విడుదలయ్యారు. రెండు వారాల క్రితం కర్ణాటక ప్రభుత్వం ఐఏఎస్ విజయ్ శంకర్‌తో పాటు మరో ఇద్దరిని విచారించేందుకు అనుమతులు ఇచ్చింది. ఇదే సమయంలో విజయ్ శంకర్ విగతజీవిగా కనిపించడం కర్ణాటకలో సంచలనంగా మారింది.