ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ పశు సంరక్షణ పథకానికి శ్రీకారం చుట్టారు. పశువులు కలిగిన రైతులు. గొర్రెల, మేకల కాపరులు, యజమానులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.
ఈ పథకం 2 నుంచి 10 ఏళ్లు వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్లు వయసున్న బర్రెలకు వర్తింపజేస్తారు. పశువులు మరణిస్తే స్వదేశీ ఆవుకు ఒక్కింటికి రూ. 30 వేలు పరిహారం, బర్రెకు రూ. 15 వేలు పరిహారం ప్రభుత్వం అందించనుంది. ఒక కుటుంబం సంవత్సరానికి గరిష్టంగా 1,50,000 రూపాయల పరిహారం పొందవచ్చు. ఆరు నెలలు ఆపై వయసున్న గొర్రెలు, మేకలకు కూడా ప్రభుత్వం ఈ పథకం వర్తింపజేస్తుంది. ప్రభుత్వం మూగ జీవాలకు హెల్త్ కార్డులు జారీ చేయడంతో పాటు 1907 టోల్ ఫ్రీ నంబర్ ను సమస్యల పరిష్కరం కోసం అందుబాటులో ఉంచింది.