తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కష్టకాలంలోను కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేసి కర్షకులకు అండగా నిలిచారు. నేడు ఖమ్మం నియోజకవర్గం కోయచలక గ్రామంలో రైతులను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రైతులకు మేలు చేసే పథకాలను కేసీఆర్ అమలు చేస్తున్నందుకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో పంట సాయం జమైందని.... ఎకరానికి 5వేల రూపాయల చొప్పున 5,294 కోట్ల రూపాయలు జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని తెలిపారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, రైతులు, నాయకులు మంత్రి పువ్వాడ వెంట ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: