చైనా భారత్ కు ఇచ్చిన మాట తప్పుతోంది. ఒకవైపు చర్చల్లో బలగాలను ఉపసంహరించుకుంటామని చెబుతూ మరోవైపు లద్దాఖ్ సహా మిగతా ప్రాంతాల్లో బలగాలను మోహరిస్తోంది. చైనా భారత్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయనుకునే లోపు పరిస్థితి మళ్లీ మొదటకు వస్తోంది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను పెంచడంతో భారత్ యుద్ధవిమానాలను మోహరిస్తోంది. తాజా శాటిలైట్ చిత్రాలలో ఇరు దేశాలు పెద్దఎత్తున బలగాలను మోహరించినట్లు తేలింది. 
 
తాజాగా ఘర్షణ చోటు చేసుకున్న ప్రాంతంలోనే చైనా విసృత స్థాయిలో టెంట్లు వేసినట్లు అధికారులు గుర్తించారు. భారత్ మొత్తం 3500 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలను పెంచుతోంది. యుద్ధ విమానాలతో పాటు అపాచీ పోరాట హెలికాఫ్టర్లు కూడా వైమానిక స్థావరాలకు చేరుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: