మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మరే రాష్ట్రంలో నమోదు కాని స్థాయిలో మహారాష్ట్రలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 3,890 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,42,900కు చేరింది. గత 24 గంటల్లో 208 మంది వైరస్ భారీన మృతి చెందారు. 
 
రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 6,739కు చేరింది. దేశంలో నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు ఎంత కఠినంగా అమలు చేసినా మహారాష్ట్రలో కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: