తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 920 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులలో ఇవే అత్యధికం. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులతో కరోనా కేసుల సంఖ్య 11,364కు చేరింది. ఈ కేసులలో 6,446 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఒక్కరోజే 327 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
ఇప్పటివరకు 4,688 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇవాళ ఐదుగురు మృతి చెందగా కరోనా మృతుల సంఖ్య 230కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 737 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: