కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఖాతాదారుల నగదుపై వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ తగ్గించనుంది. గతంలో 8.65 శాతం నుంచి 8.5 శాతానికి వడ్డీరేట్లను తగ్గించిన సంస్థ తాజాగా వడ్డీరేట్లను 8.1 శాతానికి కోత పెట్టనుందని తెలుస్తోంది. మార్కెట్ అస్థిరత, ఆదాయం భారీగా క్షీణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. త్వరలో ఈ మేరకు అధికారక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. 
 
కరోనా వైరస్ సంక్షోభం వల్ల ఖాతాదారులు ఎక్కువ నిధులను విత్‌డ్రా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 6 కోట్ల మంది ఖాతాదారులపై వడ్డీ రేట్ల కోత ప్రభావం చూపనుందని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో పీఎఫ్‌ ఖాతాలపై వడ్డీరేటును 8.65 శాతం నుంచి 8.5 శాతానికి కుదించినట్లు ప్రకటన చేశారు. ఏప్రిల్ , మే నెలల్లో 11,540 కోట్ల రూపాయల మేర, 3.61 మిలియన్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు ఈపీఎఫ్ఓ తాజాగా ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: