తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు కేసులు నమోదైన ప్రాంతాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 985 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 12,349కు చేరింది. 
 
గడిచిన 24 గంటల్లో 78 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా ప్రస్తుతం 7,436 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 4,766 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 7 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 237కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 774 కేసులు నమోదు కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: