తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో సచివాలయం కూల్చివేయకూడదని దాఖలైన పిటిషన్లను ప్రభుత్వం కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన కోర్టు తెలంగాణ సర్కార్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పు బట్టలేమని హైకోర్టు పేర్కొంది. వేర్వేరుగా దాఖలు చేసిన 10 పిటిషన్లపై విచారణ జరిపి కోర్టు ఈ తీర్పును వెలువరించింది. 
 
హైకోర్టు తీర్పుతో దేశంలోనే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత మూడో అతిపెద్ద సచివాలయంను ప్రభుత్వం కూల్చివేయనుంది. ఎర్రమంజిల్ ప్యాలెస్ స్థానంలో అసెంబ్లీని నిర్మించి.. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనాలను కూల్చివేసి, వాటి స్థానంలోనే నూతన సచివాలయాన్ని నిర్మించాలని సీఎం కేసీఆర్ గతంలో నిర్ణయించగా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: