దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఈ రైళ్లకు ఆన్ లైన్ రిజర్వేషన్ ద్వారా లేక టికెట్ కౌంటర్ల ద్వారా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించిన రైల్వే శాఖ తత్కాల్ సౌకర్యం కల్పిస్తున్నట్టు కీలక ప్రకటన చేసింది. నేటి నుంచి ఈ రైళ్లకు తత్కాల్ బుకింగ్ ప్రారంభమైంది.
రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన 200 రైళ్లతో పాటు రాజధాని రైళ్లలో కూడా తత్కాల్ బుకింగ్ అందుబాటులోకి రానుంది. రైల్వే శాఖ ఏసీ రైళ్లకు ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ రైళ్లకు ఉదయం 11 గంటలకు తత్కాల్ టికెట్ బుకింగ్ ను ప్రారంభించనుంది. రైల్వే శాఖ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ను 30 రోజుల నుంచి 120 రోజుల వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.