ప్రముఖ సినీ నిర్మాత పీవీపీపై కొన్ని రోజుల క్రితం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం కొందరు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా వారిపైకి పీవీపీ కుక్కలను ఉసిగొల్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామానికి షాక్ అయిన పోలీసులు అక్కడినుండి వచ్చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సమాచారం.
ఎస్సై హరీష్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఐపీసీ 353 సెక్షన్ కింద పీవీపీపై కేసు నమోదైంది. గత వారం పీవీపీ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పాటు దౌర్జన్యం చేస్తున్నాడని ఒక వ్యక్తి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.