గత కొన్ని రోజులుగా ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైసీపీ ఎమ్మెల్యేలు ఘాటుగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రఘురామ కృష్ణంరాజు తేడా అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయనను తాము మనిషిలా గుర్తించడం లేదని అన్నారు. బీజేపీలోకి వెళ్లిపోతున్నారు కాబట్టే రఘురామ కృష్ణంరాజు మోదీ భజన చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలపై ఎంపీ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. 
 
గత కొన్ని రోజులుగా రఘురామ కృష్ణంరాజు వైసీపీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. నిన్న సీఎం జగన్ కు రఘురామ ఆరు పేజీల లేఖ రాశారు. లేఖలో తనను యాంటీ క్రిస్టియన్‌గా చిత్రీకరించారని.... ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్‌లో మాట్లాడానని..... కొందరు పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ కథనాలు కల్పించారని... పార్టీ లెటర్ హెడ్ కాకుండా మరో లెటర్ హెడ్‌పై షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: