ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28,239 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 657 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఈ కేసులలో 611 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా మిగిలిన కేసులు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు చెందినవని సమాచారం.
రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 15,252కు చేరింది. వైరస్ వల్ల గడిచిన 24 గంటల్లో ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 193కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,071 యాక్టివ్ కేసులు ఉండగా 6,998 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.