ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. నూతన అప్లికేషన్‌ను ఆగష్టు 1న లాంచ్ చేయనున్నట్టు ఆర్టీసీ నుంచి ప్రకటన వెలువడింది. సూపర్ లగ్జరీ సర్వీసుల దగ్గర నుంచి పల్లెవెలుగు బస్సుల దాకా అన్ని టికెట్లను ప్రథమ్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చని చెబుతోంది. యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారికి 5 శాతం డిస్కౌంట్ లభించనుంది.
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నగదురహిత లావాదేవీలను జరిపేందుకు వీలుగా ఆర్టీసీ అధికారులు ప్రథమ్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అధికారులు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్‌సైట్‌ను కూడా అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు.