కువైట్ ప్రభుత్వం ప్రవాసులకు భారీ షాక్ ఇస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కువైట్ కేబినెట్ విదేశీయుల కోటాను కుదించేందుకు తాజాగా ఆమోదం తెలిపింది. ఐదుగురు ఎంపీల బృందం ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టగా జాతీయ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కమిటీ ఆమోదం తెలపడంతో ప్రవాసులకు షాక్ తగిలింది. ఈ ముసాయిదా బిల్లును కువైట్ అమలు పరచాల్సి ఉంది.
కువైట్‌లో అధికంగా ఉన్న భారత ప్రవాసులతో పాటు ఇతర దేశాల వలసదారులపై ఈ బిల్లు ప్రభావం పడనుంది. తాజా బిల్లు ప్రకారం కువైట్ మొత్తం జనాభాలో భారత ప్రవాసులు 15 శాతానికి మించి ఉండకూడదు. ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, శ్రీలంక ప్రవాసులు 10 శాతం.... పాకిస్థాన్, బంగ్లాదేశ్, వియత్నం, నేపాల్‌కు చెందిన ప్రవాసీయులు 3 శాతం మాత్రమే ఉండేందుకు కువైట్ ప్రభుత్వం అనుమతివ్వనుంది. 2018 కువైట్ జనాభా లెక్కల ప్రకారం అక్కడ 10 లక్షల మంది భారత ప్రవాసులు కువైట్ లో ఉండగా బిల్లు అమలులోకి వస్తే 6 లక్షల మందికి మాత్రమే కువైట్ ప్రభుత్వం అనుమతులిస్తుంది.