గుజరాత్ రాష్ట్రంలోని ఏటీఎంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. సీటీఎం ప్రాంతంలోని ఓ బ్యాంకు ఏటీఎంలో మంటలు చెలరేగటంతో పది లక్షల రూపాయలు కాలిపోయాయి. ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. బ్యాంకుకు మంటలు అంటుకోకుండా తగిన చర్యలు చేపట్టారు. 
 
ఏటీఎంలో ఉన్న క్యాష్‌తో పాటు.. పాస్ బుక్ ప్రింటింగ్ మిషన్‌ ఈ ఘటనలో పూర్తిగా కాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: