టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో విశాల్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఆయన చాలా చిత్రాలను నిర్మించారు. అయితే ప్రొడక్షన్ హౌస్ లో పని చేసే రమ్య అనే మహిళ విశాల్ ను 45 లక్షల రూపాయలు మోసం చేసిందనే వార్త గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. సుమారు ఆరు సంవత్సరాల నుంచి తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న రమ్య అనే మహిళ మేనేజర్ హరి సహాయంతో 45 లక్షల రూపాయలు మోసం చేసినట్లు విశాల్ గుర్తించారు.
దీంతో ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సదరు మహిళ మీడియాతో మాట్లాడుతూ విశాల్ పైకి హీరోగా కనిపిస్తాడు కానీ, అతడో పెద్ద విలన్ అని.... ఆఫీస్‌లో నా ముందే ఎన్నో విషయాలు జరిగాయని... అవన్నీ బయటపెడితే విశాల్ అసలు బండారం బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళను అవ్వడం వల్ల తాను ఇన్నిరోజులు సైలెంట్ గా ఉన్నానని పేర్కొన్నారు.