ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైయస్సార్ సమాధి దగ్గర ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. సీఎం జగన్ మాట్లాడుతూ వైయస్సార్ మరణం లేని మహానేత అని చెప్పారు. రైతు పక్షపాతి అయిన మహానేత జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆరోగ్యశ్రీ, 104...108 సేవలు, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి ఎన్నో పథకాలను వైయస్సార్ ప్రవేశపెట్టారని చెప్పారు.  
 
పథకాల రూపంలో ఆయన ఎప్పటికీ చిరంజీవే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి రెడ్డి, వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: