వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో చట్టం ఎవరికీ చుట్టం కాదని అన్నారు. నివేదిక వచ్చిన 24 గంటల్లోనే ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సహా 12 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. విదేశీయుడైన మల్టీ నేషనల్ కంపెనీ సీఈవోను అరెస్ట్ చేయడం దేశంలోనే ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. భోపాల్ యూనియన్ కార్బైడ్ నుంచి ఇప్పటి వరకు నిందితులు విదేశాలకు పారిపోవడమే చూశామని.... ఆంధ్రాలో అలా కాదని అన్నారు. 
 
విశాఖ జిల్లా వెంకటాపురం గ్యాస్ లీకేజీ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గ్యాస్ లీకేజీ ఘటనకు సంస్థకు చెందిన వాళ్లను బాధ్యులను చేస్తూ ప్రభుత్వం నిన్న సీఈవోతో పాటు 12 మందిని అరెస్ట్ చేసింది. గ్యాస్ లీకేజీ దుర్ఘటన జరిగిన మే 7వ తేదీనే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: