ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ యంత్రాలను తక్కువ ఖర్చుతో వినియోగించుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. తక్కువ రేటుకే రైతులకు యంత్రాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. గత ప్రభుత్వం బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. అక్టోబర్ 2019 - 2020 ఖరీఫ్ కు సంబంధించి పూర్తి వడ్డీ రుణాలను చెల్లించినట్లు ప్రకటన చేశారు.
చక్కెర రైతులకు 88 కోట్లు విడుదల చేస్తున్నామని.... ఈ నిధుల వల్ల 36,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఏపీలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సకాలంలో రుణాలు చెల్లించిన రైతులు సున్నా వడ్డీ పథకానికి అర్హులవుతారని పేర్కొన్నారు.