![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/narendra-modi-govt-says-good-news-to-farmers919ec839-d721-4e3a-a08c-f49bae1b0e1d-415x250.jpg)
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఆరో విడత నిధులను జమ చేయనుంది. మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. 10 కోట్లకు పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రతి సంవత్సరం కేంద్రం 2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో 6,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తోంది.
ఆగష్టు 1వ తేదీన రైతుల ఖాతాలలో ఆరో విడత నగదు జమ కానుంది. ఈ పథకంలో చేరని వారు ఉంటే పొలం వివరాలు, ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ సమాచారంను పీఎం కిసాన్ వెబ్ సైట్ లో పొందుపరిచి ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. కేంద్రం అందించిన నగదు రైతులకు పెట్టుబడి సాయం రూపంలో ఉపయోగపడుతోంది.