బీజేపీ తమ ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపుతోందని.. ప్రలోభాలకు గురి చేస్తోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఈ ఆరోపణలు చేయడం జాతీయ రాజకీయ వర్గాల్లో బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేస్తుందన్న దానిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శనివారం మీడియాతో మాట్లాడిన అశోక్ ఓ వైపు దేశంలో కరోనా మహమ్మారి దేశంలో ఇంతలా విజృంభిస్తుంటే మరోవైపు బీజేపీ దారుణమై నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యేలకు డబ్బులు, ఇతర ప్రలోభాలకు గురి చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతోనే బీజేపీ నీచ రాకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోనుంచి తప్పించడమే లక్ష్యంగా బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో అద్భుతంగా పని చేస్తుంటే బీజేపీ మాత్రం సమస్యలు పెంచేలా పని చేస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో విజయం సాధించిన నాటి నుంచి బీజేపీ అసలు రంగు బయటపడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా.. సీఎం హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.