ఏపీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా కరోనా భారీన పడ్డారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషాతో పాటు ఆయన భార్య, కుమార్తెకు కూడా కరోనా నిర్ధారణ అయింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో వైరస్ నిర్ధారణ కావడంతో ఆయనను తిరుపతిలోని కరోనా ఆసుపత్రికి తరలించారు. డిప్యూటీ సీఎం, ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక గదిని కేటాయించారు. 
 
ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్విమ్స్ అస్పత్రి వైద్యులు చెబుతున్నారు. అనంతరం నిన్న సాయంత్రం వాళ్లు హైదరాబాద్ లోని ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. డిప్యూటీ సీఎంకు కరోనా నిర్ధారణ కావడంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు హోం క్వారంటైన్  కు పరిమితమవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: