మందు తాగితే మనిషే కాదు.. అన్న చందంగా కొంత మంది మద్యం సేవిస్తే తమను తాము మర్చిపోవడం కాదు.. ఎంత ఘోరాలకైనా తెగబడుతుంటారు.  మద్యం మత్తు దిగిన తర్వాత తాము చేసిన తప్పు తెలుసుకొని షాక్ తినడం.. జరుగుతుంది.   ఇటీవల కాలంలో మద్యం సేవించి ఆడవారిపై అఘాయిత్యాలకు పాల్పపడ్డ కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  తాజాగా ఓ తండ్రి మద్యం మత్తులో సొంత కొడుకునే చంపిన ఘటన కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలంలో చోటు చేసుకుంది. కడప జిల్లా వీరపునాయునిపల్లె మండలం ఓబుల్​రెడ్డి పల్లెలో తాగిన మైకంలో తండ్రీ, కుమారుడి మధ్య ఘర్షణ జరగడంతో మద్యం మత్తులో కుమారుడిని నరికి చంపాడు. 

 

పదునైన కత్తితో  కొడుకుపై దాడి చేశాడు.. దాంతో కొడుకు అక్కడే మృతి చెందాడు.  గత కొంత కాలంగా మద్యానికి బానిసైన తండ్రి కుటుంబ సభ్యులపై గొడవ పడటం.. ఇబ్బందులకు గురి చేయడం లాంటివి చేస్తున్నాట్లు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: