రాజస్థాన్ రాజకీయం  మొత్తం ఎంతో హాట్ హాట్ గా సాగుతున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు  కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న సచిన్ పైలెట్ తిరుగుబాటు చేయడంతో ప్రస్తుతం రాజస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడిన  నేపథ్యంలో పార్టీ కీలక  సమావేశాలకు హాజరు కానీ 19 మంది పార్టీ నాయకులకు కాంగ్రెస్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

 

 ప్రస్తుత ముఖ్యమంత్రి గెహ్లట్  వర్గం జైపూర్లోని ఫైయిర్ మంత్  హోటల్ లో బస చేస్తున్న నేపథ్యంలో అక్కడ సమావేశానికి హాజరుకాని సచిన్ తో  పాటు ఆయన తరపు మద్దతు తెలిపిన  ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ నోటీసులు ఇచ్చింది. పార్టీ సమావేశానికి ఎందుకు హాజరు  కాలేదు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని లేని పక్షంలో అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. కొంతమంది పార్టీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే పార్టీ సమావేశానికి హాజరు కాలేదని నోటీసులో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: