గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. నేడు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కరోనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ప్రైవేటు ఆస్పత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్ బెడ్ల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
కరోనా వైరస్ తో సహజీవనం చేయాల్సిన పరిస్థితి నెలకొందని ప్రజలు నిర్లక్ష్యానికి తావివ్వకూడదని వ్యాఖ్యలు చేశారు. గాంధీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో 3000 బెడ్లు ఆక్సిజన్‌ సౌకర్యంతో ఉన్నాయని... కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు అందిస్తామని.... ఆయుష్‌ అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచేలా నిర్ణయం తీసుకుంటామని ఈ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: