దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల హీరో నితిన్ పెళ్లి వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి నెలలోనే నితిన్, షాలినిల వివాహానికి సంబంధించిన పసుపు కుంకుమ కార్యక్రమం జరిగింది. గ్రాండ్ గా పెళ్లి జరపాలని నితిన్, షాలిని కుటుంబ సభ్యులు భావించినా కరోనా, లాక్ డౌన్ వల్ల పరిస్థితులు మారిపోయాయి. కరోనా వైరస్ ఉధృతి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. 
 
ఇప్పట్లో వైరస్ అదుపులోకి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ఇరు కుటుంబాలకు సంబంధించిన వారి సమక్షంలో నితిన్, షాలినీల పెళ్లి జరపాలని వాళ్ల కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. జూలై 26 సాయంత్రం 8 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో వివాహం జరగనుంది. ప్రస్తుతం నితిన్ రంగ్ దే, చెక్ సినిమాలలో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: